Balcony Cloth Drying Hangers
Cloth Drying Hangers, In cities and small towns, houses and apartments built in less space, so there is not as much room for drying clothes as in the earlier days. In apartments, there is a situation where clothes have to be dried in a small space in the balcony or near the bathroom.
నగరాలు మరియు చిన్న పట్టణాలలో ఇల్లు మరియు అపార్టుమెంట్లు తక్కువ స్థలం లో నిర్మాణం జరగటం వలన పూర్వపు రోజుల లాగా ఎక్కువ బట్టలు ఆరేసుకునే సౌకర్యం ఉండటం లేదు. అపార్ట్మెంట్ లలో బాల్కనీ లోనో బాత్ రూమ్ దగ్గరో ఉన్న చిన్న స్థలం లోనే బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఇంట్లో ఉన్న అందరి బట్టలు ఒకే సారి ఆరేయలేని పరిస్థితి ఉంటుంది. బట్టలు ఆరేయటం అనే సమస్య వర్షాకాలం మరియు చలి కాలం లో ఎక్కువగా ఉంటుంది.
అయితే ఈ సమస్యకి ఒక చక్కటి ఉపాయం బట్టలు ఆరేసుకునే హాంగర్లు. ఇవి బిగించటం వలన మీకు ఉన్న కొద్దిపాటి స్థలం లో ఎక్కువ బట్టలు ఆరేసుకోవచ్చు. వీటి వలన మీ స్థలం ఆరింతలు పెరుగుతుంది. ఇవి మీ ఇంటి పైకప్పుకి అమర్చి ఉండటం వలన మీకు నడిచేటప్పుడు అడ్డు రావు మీ బాల్కనీ లేదా వరండా స్థలాన్ని ఆక్రమించవు.
ఈ హాంగర్ లు స్టీల్ పైపులు మరియు నైలాన్ తాళ్ల సహాయం తో మీ పైకప్పుకి ఆనుకొని ఉంటాయి . మీకు అవసరం అయినప్పుడు ఒక్కొక్క పైపుని కిందికి దించి బట్టలు ఆరేసి మళ్ళీ పైకి పెట్టవచ్చు. ఒక సెట్లో 6 స్టీల్ పైపులు ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి పైపుల సంఖ్య పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
ఈ హాంగర్ లు 4 అడుగుల నుండి 8 అడుగుల వరకు ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న పొడవును బట్టి మీకు నచ్చిన హాంగర్ ని ఎంచుకోవచ్చు.
ఇంతకు ముందు పైకప్పుకి మరియు గోడకి అమర్చే పట్టిలు ప్లాస్టిక్ వి వచ్చేవి అయితే క్రమంగా అవి తగ్గి వాటి స్థానం లో మెటల్ తో చేసిన పైకప్పుకి మరియు గోడకి అమర్చే పట్టిలు వచ్చాయి. ఈ మెటల్ పట్టిలు గట్టిగ ఉండటమే కాక ఎక్కువ మన్నికైనవి.
హాంగర్ లలో పైపు సైజు అనేది చాలా ముఖ్యముగా చూడవలసిన విషయం. ఈ హాంగర్ లు 1/2 ఇంచు మరియు 5/8 ఇంచు లతో లభ్యమౌతాయి. ఇందులో 5/8 ఇంచు లతో ఉండే పైపులు ఎక్కువ లావు గా ఉంది బట్టలు వేసినా వంగి పోకుండా గట్టిగా ఉంటాయి.
ఈ హాంగర్ లు మేము మీకు మీ ఇంటి వద్ద ఇన్స్టాల్ చేస్తాము. వివరాలకు మరియు ఆర్డర్లకు మాకు కాల్ చేయండి.